ఆస్ట్రేలియాలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ కప్ క్రికెట్‌ టోర్నీ | KCR Cup Cricket Tournament Started Grandly In Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ కప్ క్రికెట్‌ టోర్నీ

Sep 3 2023 2:42 PM | Updated on Sep 4 2023 9:32 PM

KCR Cup Cricket Tournament Started Grandly In Australia - Sakshi

బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్వర్యంలో జరుగుతున్న కేసీఆర్ కప్ క్రికెట్‌ టోర్నమెంట్ నేడు మెల్‌బోర్న్‌లోని  పవిలియన్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులతో  3 వారాల పాటు ఈ టోర్నమెంట్ సాగనుందని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు . సెప్టెంబర్ 16, 17 తేదీల్లో  గ్రాండ్ ఫైనల్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భారత దేశానికి చెందిన అన్ని రాష్ట్రాల ఎన్నారైలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు ఇందులో పాల్గొంటారని నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు.  

టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని, అందుకు క్రికెట్‌ టోర్నీనే సరైన వేదిక అని నాగేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమంపై  విక్టోరియా స్టేట్ కన్వీనర్ సాయిరాం ఉప్పు చేసిన పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్ అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సాయి రామ్ ఉప్పు, విశ్వామిత్ర మంత్రి ప్రగడ,  వినయ్ సన్నీ గౌడ్, బాలరాజు కుమ్మరి, వంగపల్లి సురేందర్ రెడ్డి, హర్ష రెడ్డి, గండ్ర ప్రశాంత్ రావు, విజయ్ నడదూర్, శివ హైదరాబాద్, హరి పల్ల, కరుణాకర్ నందవరం మరియు వివిధ సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement