ఆయ్‌.. మేం గోదారోళ్ల మండి.. యూకేలో గోదారోళ్ల సంక్రాంతి సంబరాలు

Grand Sankranti Celebrations In London Under The Leadership Of Uk Godarollu - Sakshi

సంక్రాంతి అంటేనే గోదారి జిల్లాలు… గోదారోళ్లు అంటేనే సంక్రాంతికి ప్ర‌తీక‌లు... అందునా కోనసీమ వాళ్లయితే మరీనూ.. సంక్రాతిని తమ జీవితం నుంచి వడదీసి చూడటానికి ఏమాంత్రం ఇష్టపడరు. అందుకే ఉద్యోగం, వ్యాపారం అంటూ ఖండాంతరాలు దాటినా సంక్రాంతి పండగుపై మమకారం ఎక్కవైతుందే తప్పా.. ఎక్కడ తగ్గట్లేదు. అలాంటి సంక్రాంతి సంబరాలు యూకేలో ఘనంగా జరిగాయి. 

మాది యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గోదావరి అని ముద్దుగా చెప్పుకునే యుకే గోదారోళ్ళు సంక్రాంతి సంబరాలు లండన్‌లో జనవరి 21న అంబరాన్ని అంటేలా నిర్వహించారు. చిన్న పిల్లలకు భోగి పళ్ళతో మొదలుకొని, గొబ్బిళ్ళు పాటలతో, స్వయంగా తామే వండి వడ్డించిన అరిటాకులో విందు భోజనం, తెలుగు సంస్కృతిని, గోదావరి వెటకారాన్ని, యాసని గుర్తు చేస్తూ ఆట పాటలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించడం స్థానికుల్ని సైతం అబ్బుర పరిచింది. 


గోదావరి ప్రాంత సాంప్రదాయ వంటకాలతో పసందైన విందుతో రుచులను ఆస్వాదించారు. వచ్చిన ఆడపడుచులు అందరినీ పసుపు కుంకాలతో ఆహ్వానించి, జీడ్లు, రేగి వడియాలు,  ఒక సర్ప్రైజ్ స్వీట్ సారెగా ఇచ్చి సాగనంపారు. యూకేలోని సుమారు 1500 పైగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలే కాక, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని  కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నిర్వాహకులు తెలిపారు. 

మరిన్ని వార్తలు :

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top