APTA: అట్లాంటా వేదికగా సెప్టెంబర్ లో "ఆప్తా" కన్వెన్షన్..! | The APTA National Convention Will Be Held In Atlanta in September | Sakshi
Sakshi News home page

APTA: అట్లాంటా వేదికగా సెప్టెంబర్ లో "ఆప్తా" కన్వెన్షన్..!

Jun 12 2023 1:04 PM | Updated on Jun 12 2023 2:02 PM

The AFTA National Convention Will Be Held In Atlanta in September - Sakshi

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) 15 ఏళ్ల జాతీయ కన్వెన్షన్.. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో.. సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు వరకు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొట్టే ఉదయ భాస్కర్, ఏ. బాబి ప్రకటించారు. హైదరాబాద్ లో   జరిగిన మీడియా సమావేశంలో వారు ప్రసంగించారు. ఆప్తా ఏర్పడి 15 ఏళ్ల అయిందని సుమారు పదివేల మంది కి పైగా స్కాలర్ షిప్ లు అందిస్తున్నదని నిర్వాహకులు తెలియజేశారు. 

మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బు కోలా ఉదయభాస్కర్ కొట్టి, విజయ్ గుడిసె,  గోపాల్ గుడిపాటి, అడ్డా బాబి  తదితరులు ప్రసంగించారు. ఈ సంవత్సరానికి ఆప్తా కన్వెన్షన్ కు సుమారు 7000 మంది సభ్యులు హాజరవుతారని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కమ్యూనిటీ లీడర్లకు, పాఠశాలలకు, దాతలకు, వ్యాపారవేత్తలకు, ఇతర వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు అందజేసినట్టు వివరించారు. 15 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ సంస్థ చదువు, సేవే పరమార్థంగా పనిచేస్తుందని తెలిపారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నట్టుగా వివరించారు.

అమెరికాకు వచ్చే వేలాదిమంది విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ సేవలు విద్య ఉపాధి సౌకర్యాలను కూడా కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆప్తా కన్వెన్షన్ కు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులందరూ తరలి రావాల్సిందిగా కోరారు. తెలుగు సంఘాలు ఎన్ని ఉంటే అంత మేలు జరుగుతుందని అమెరికాలో ఎవరికీ పోటీ కాదని అందరం కలిసి మెలిసే పని చేస్తామని వారు చెప్పారు. ప్రశ్నించుకుంటాం తప్ప ఒకరికి ఒకరు పోటీ కాదని తెలిపారు.

త్వరలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలలోనూ మీడియా సమావేశాలు నిర్వహించి తమ సదస్సు ఉద్దేశాలను వివరిస్తున్నట్టు తెలిపారు. తెలుగు అంటే రెండు రాష్ట్రాలే కాదని ఐదు రాష్ట్రాలకు పైగా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని.. అమెరికాలోని సేవ కార్యక్రమాలను ఈ రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్నట్టుగా తెలిపారు. సదస్సు కర్తవ్యాన్ని మర్చిపోకుండా సుమారు 500 మంది వాలంటీర్లు నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు.

(చదవండి: పెన్సిల్వేనియాలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement