నీరున్న చెరువులకే..! | - | Sakshi
Sakshi News home page

నీరున్న చెరువులకే..!

Sep 28 2026 1:23 AM | Updated on Sep 28 2026 1:23 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌
ఉచిత చేప పిల్లల పంపిణీ

● సమృద్ధిగా నీరున్న చోటే వదలాలని నిర్ణయం

● చెరువుల్లో నీటి పరిస్థితిపై ఇరిగేషన్‌ శాఖను

నివేదిక కోరిన మత్స్యశాఖ

● జిల్లాలో 40 శాతం కూడా నిండని

చెరువులు 260కి పైనే..

చదువుతోపాటు..

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరమని అమేచూర్‌ తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు.

సోమవారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

– 8లో u

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి నీటి కొరత సమస్య ఏర్పడింది. అరకొర నీరున్న చెరువుల్లో చేప పిల్ల లను వదిలితే, అవి బతికే అవకాశం లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఈసారి స మృద్ధిగా నీరున్న చెరువుల్లోనే చేప పిల్లలను వదలాలని మ త్స్య శాఖ అధికారు లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 40 శాతం, అంతకన్నా ఎక్కువ నీరున్న చెరువులను గుర్తిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని చెరువుల్లో ప్రస్తుత నీటి లభ్యతను తెలుసుకునేందుకు నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్‌ అధికారులను కోరారు. అయితే, తాజా లెక్కలను పరిశీలిస్తే జిల్లా లో దాదాపు 260కి పై గా చెరువులు 40 శా తం కూడా నిండలే దు. నిజామాబాద్‌, ఆ ర్మూర్‌, బాల్కొండ డి విజన్‌లలో నీటి లభ్యత లేని చెరువుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. రిపోర్టును పరిశీలించిన తర్వాత ఏయే చెరువుల్లో చేపపిల్లలు వదలాలో నిర్ణయానికి రానున్నారు.

చెరువులను గుర్తిస్తున్నాం..

జిల్లాలో నీరు లభ్యత లేని చెరువుల్లో చేపపిల్లలు వదిలితే అవి బతికే అవకాశం ఉండదు. అందుకే కే వలం 40 శాతం, అంతకన్నా ఎక్కువ నీరున్న చెరు వుల్లోనే చేపపిల్లలు వేయాలని ప్రాథమికంగా నిర్ణయించాం. సన్నాహాక సమావేశం నిర్వహించి వా రం, పది రోజుల్లో చేపపిల్లల పంపిణీని ప్రారంభిస్తాం. – నాగులు, జిల్లా మత్స్య శాఖ అధికారి

4.54 కోట్ల చేపపిల్లలకు

టెండర్లు పూర్తి..

జిల్లాలో 1,097 చెరువులు ఉండగా, ఈ సంవత్స రం 967 చెరువుల్లో 4.54 కోట్ల చేపపిల్లలను పో యాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం టెక్నికల్‌, ఫైనాన్షియల్‌ టెండర్లు నిర్వహించగా నలుగురు గుత్తేదార్లు పంపిణీ కాంట్రా క్ట్‌ దక్కించుకున్నారు. ఒక లక్ష చేపపిల్లల చొప్పు న సరఫరా చేసేందుకు ప్రభుత్వ ధర రూ.1.82 లక్షలు ఉండగా, గుత్తేదార్లు రూ.1.64 లక్షలకు కోట్‌ చేశారు. అదనపు కలెక్టర్‌ అధ్యక్షతన తుది రే టు ఫైనల్‌ చేసి వర్క్‌ ఆర్డర్లు ఇవ్వడమే ఆలస్యం. నీటి కొరత కారణంగా చెరువుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున, వదిలే చేపపిల్లల సంఖ్య కూ డా తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది 35–40 ఎంఎం, 80–100ఎంఎం సైజు ఉన్న 3.86కోట్ల చేప పిల్లలను మాత్రమే చెరువుల్లో పోశారు.

జిల్లాలోని చెరువుల్లో నీటి పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement