పల్లె ప్రగతిపై సర్కారు ఫోకస్‌! | - | Sakshi
Sakshi News home page

పల్లె ప్రగతిపై సర్కారు ఫోకస్‌!

Sep 28 2026 1:23 AM | Updated on Sep 28 2026 1:23 AM

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పల్లెల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతు న్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాల ని నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవా రం కామారెడ్డి కలెక్టరేట్‌లో ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల పరిధిలోని పది జిల్లాల ప్రగతిపై ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఈ సమావేశంలో పాల్గొంటారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులకు సూచనలిస్తారు. ఎల్‌ నినో ప్రభావంతో సరిపడా వర్షాలు కురవక ప్రాజెక్టులు నిండకపోవడంతో మిషన్‌ భగీరథ ద్వారా పల్లెలకు నీటిని అందించేందుకు ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించాలన్న దానిపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి చేపట్టాల్సి న చర్యలు, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయడం, ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపర్చడంపై అధికారులకు సూచనలిస్తారు.

పరిష్కారం చూపుతారా..

పల్లెల ప్రగతిపై సమీక్షించే క్రమంలో సమస్యలకు మంత్రి సీతక్క ఎలాంటి పరిష్కారం చూపుతారన్న దానిపై చర్చ నడుస్తోంది. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పల్లెలకు ప్రత్యేక నిధులు ఇస్తారని ఆశిస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి..

పట్టణంలోని కలెక్టరేట్‌లోగల సమావేశ మందిరంలో సమీక్ష సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి సోమవారం ఇక్కడ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మెయిన్‌ హాల్‌ నుంచి మార్చారు.

సమస్యల వలయంలో జీపీలు..

గ్రామ పంచాయతీలకు వివిధ పద్దుల కింద నిధులు, పెండింగ్‌ బిల్లులు రాకపోవడంతో పల్లెల అభివృద్ధికి ఆటంకంగా మారింది. గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ సెంటర్‌ భవనాల పనులు అసంపూర్తిగా మిగిలాయి. చాలా గ్రామాల్లో జీపీ ట్రాక్టర్ల నిర్వహణకు డబ్బులు లేక మూలన పడ్డాయి. మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతు న్నా, ఇప్పటికీ చాలా గ్రామాలకు నీరందడం లేదు. ముఖ్యంగా గిరిజన తండాలకు నీటి సరఫరా సరిగా లేకపోవడంతో చాలాచోట్ల బోర్లను వాడుతున్నారు. మోటార్లు, పైపులైన్ల మరమ్మతులకు అడ్డగోలు ఖర్చవుతున్నాయని సర్పంచ్‌లు అంటున్నారు.

నేడు కామారెడ్డిలో

మంత్రి సీతక్క సమీక్ష

పంచాయతీరాజ్‌,

గ్రామీణాభివృద్ధి శాఖల పనులపై..

పాల్గొననున్న పది జిల్లాల

ప్రజాప్రతినిధులు, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement