బోధన..అభ్యసన మెరుగుపడేలా.. | - | Sakshi
Sakshi News home page

బోధన..అభ్యసన మెరుగుపడేలా..

Sep 28 2026 1:23 AM | Updated on Sep 28 2026 1:23 AM

● ప్రభుత్వ స్కూళ్లలో తనిఖీలు

● హైస్కూల్‌కు 8 మంది టీచర్ల బృందం

● ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలకు ముగ్గురు చొప్పున..

ఖలీల్‌వాడి: అభ్యసన ఫలితాలను మెరుగుపర్చడంతోపాటు ఉపాధ్యాయుల పనితీరు పర్యవేక్షణే ల క్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. విద్యాబోధన, ప్రమాణాల పెంపు, ఇతర అంశాల అమలును తెలుసుకునేందుకు విద్యాశాఖ ఉపాధ్యాయుల బృందాన్ని నియమించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తనిఖీలకు ఒక హెచ్‌ఎం, ఇద్దరు ఎస్జీటీలు, హైస్కూళ్లకు ఒక హెచ్‌ఎంతోపాటు సబ్జెక్టుల వారీగా టీచర్లను ఏర్పాటు చేసింది.

సేకరించే వివరాలు..

విద్యార్థుల అభ్యసన, ఉపాధ్యాయుల బోధన స్థాయిలను పరిశీలిస్తున్నారు. విద్యార్థుల హాజరు, స్కూళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ, డిజిటల్‌ క్లాసులు, పరీక్షల నిర్వహణ, పీఎంశ్రీ స్కూళ్లలో కార్యక్రమా లు, ఎకో క్లబ్ల్‌లు, పునఃశ్చరణ క్లాసులు, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ వినియోగం, ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలు, మధ్యాహ్న భోజన పథకం, మంచినీరు, మౌలిక వసతులు, పేరెంట్స్‌–టీచర్‌ సమావేశాలు, నోబ్యా గ్‌ డే అమలు, ఇతర కార్యక్రమాల వివరాలను తెలుసుకుంటారు. అనంతరం నివేదికలను సిద్ధం చేసి డీఈవోకు అందజేయడంతోపాటు ప్రత్యేక యాప్‌లో పొందుపరుస్తున్నారు. ప్రత్యేక తనిఖీ బృందాలు ఇచ్చే నివేదిక ప్రకారం పాఠశాలల్లోని లోటు పాట్లు, మౌలిక వసతులను సరిచేసి స్కూళ్లను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అయితే, తనిఖీ బృందాల్లో టీచ ర్లు ఉండటం, సమాన క్యాడర్ల ఉపాధ్యాయులతో తనిఖీలు చేపట్టడం సరైంది కాదని పలు ఉపాధ్యాయ సంఘాల వాదన. టీచర్లతో తనిఖీ చేయించడం ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయని విద్యా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

37 మంది టీచర్లతో..

ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ, ఎంపీపీ హైస్కూళ్లలో వేర్వేరుగా తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని 33 మండలాల్లోని ప్రాథమిక పాఠశాలలను ఆరు బృందాలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒక బృందం, హైస్కూళ్లను రెండు బృందాలు పరిశీలిస్తున్నాయి. తనిఖీల్లో మొత్తం 37 మంది టీచర్లు పాల్గొంటున్నారు. ప్రత్యేక బృందాలు ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు తనిఖీలు నిర్వహిస్తాయి.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు

తనిఖీలు కొనసాగుతున్నాయి

జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో కేటాయించిన బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ బృందాలు ఈ విద్యా సంవత్సరం వరకు ఉంటాయి. వారు ఇచ్చే నివేదికల ఆధారంగా స్కూళ్ల బలోపేతానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

– బాలరాజు, సెక్టోరియల్‌ అధికారి, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement