న్యూస్‌రీల్
నిజామాబాద్
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు
● చివరి ఆయకట్టు వరకు నీరందించాలి
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
● రామడుగు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల
భూ కబ్జాలపై ఉన్న శ్రద్ధ..
అధికారంలో ఉన్నవారు సొంత ప్రయోజనా లు, భూ కబ్జాలపై దృష్టిసారిస్తున్నారని విద్యా కమిషన్ మాజీ చైర్మన్ మురళి విమర్శించారు.
ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
– 8లో u
‘సాగర్’లోకి 3,970 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శనివారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం 3,970 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన వర్షాలకు ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతుండడం, హల్దీవాగు, పసుపులేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నిజాంసాగర్‌లో ఇన్‌ఫ్లో పెరుగుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. శనివారం సాయంత్రానికి 1,400.67 అడుగులు (12.088 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు.
23న బాలికల కబడ్డీ జట్టు ఎంపిక
వేల్పూర్(ముప్కాల్): ముప్కాల్ మండల కేంద్రంలోని భూదేవి ఇండోర్ స్టేడియంలో ఈనెల 23న అండర్ –20 జూనియర్ బాలికల కబడ్డీ సెలక్షన్స్ జరుగుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అంద్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి కే.గంగాధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో వచ్చేనెల 9 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న 52వ అంతర్‌జిల్లా అండర్ –20 జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు జిల్లా బాలికల జట్టును ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. 2006 నవంబర్ 30 తర్వాత జన్మించిన వారు అర్హులని, బరువు 65 కిలోలకు మించొద్దని, ఆధార్‌కార్డు, ఎస్సెస్సీ మె మో వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99898 14410 నంబర్‌ను స్పందించాలని సూచించారు.
23న స్పాట్ కౌన్సెలింగ్
రుద్రూర్: బీటెక్ – ఫుడ్ టెక్నాలజీ కోర్సులో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 23న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రుద్రూర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ కె వెంకట్‌రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఎంపీసీ సబ్జెక్టుగా ఉండి ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని, ఎప్‌సెట్ ర్యాంక్ ఉన్నా లేకపోయినా బీటెక్ (ఫు డ్ టెక్నాలజీ) కోర్సులో ప్రవేశానికి స్పా ట్ కౌన్సెలింగ్ ద్వారా అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
డీజే అడ్వాన్స్ వాపస్ ఇప్పించిన పోలీసులు
మాచారెడ్డి: వినాయక విగ్రహాల నిమజ్జన శో భాయాత్ర సందర్భంగా డీజేలకు అనుమతి లేదంటున్న పోలీసులు.. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మా చారెడ్డి పోలీసులు డీజే కోసం ఇచ్చిన అడ్వాన్స్‌ను మండప నిర్వాహకులకు ఇప్పించారు. అక్కాపూర్ గ్రామానికి చెందిన గడ్డం శ్రీ కాంత్ గణేశ్ శోభాయాత్ర నిమిత్తం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన లడ్డు ఆర్‌ఆర్‌ఆర్ డీజే నిర్వాహకులకు 15 రోజుల క్రితం రూ. 60 వేలు చెల్లించారు. డీజేలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాంత్ పో లీసులను ఆశ్రయించాడు. ఎస్సై విజయ్ చొ రవ తీసుకొని డబ్బులు వాపస్ ఇప్పించారు.
ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 4.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేయగా.. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకు న్నారు. ఇందు కోసం మొత్తం 736 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అక్టో బర్ రెండో వారం తరువాత కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం
ఉంది.
సుభాష్‌నగర్: వానాకాలం ధాన్యం సేకరణకు అదనపు కలెక్టర్ భుజంగరావు ఆధ్వర్యంలో జిల్లా పౌరసరఫరాల, సంబంధిత శాఖల అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. సుమారు 6.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రాథమిక సహకార సంఘాలు, మెప్మా, ఐకేపీ, డీసీఎంఎస్ తదితర సంస్థలు ఆధ్వర్యంలో 736 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించనున్నారు. అక్టోబర్ రెండోవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ట్రాన్స్‌పోర్ట్ టెండర్ ఖరారు
ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లను పౌరసరఫరాల, కార్పొరేషన్ అధికారులు చకచక చేస్తున్నారు. ఇప్పటికే సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు ట్రాన్స్‌పోర్ట్ టెండర్ ప్రక్రియను పూర్తిచేశారు. జిల్లాలోని మండలాలను 10 సెక్టార్లుగా విభజించారు. సుమారు 600కు పైగా లారీలు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ధాన్యం సేకరించేందుకు 1.63 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 69 లక్షలకుపైగా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 94లక్షల బ్యాగుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు.
నిల్వ కోసం స్థల అన్వేషణ!
రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లుల బంద్ నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం నిల్వ చేసేందుకు ప్రత్యామ్నా య చర్యలు చేపట్టింది. ఏఎంసీల్లోని ఓపెన్ షెడ్లు, డిఫాల్ట్ రైస్‌మిల్లులు, ఎస్‌డబ్ల్యూహెచ్ గోదాములతోపాటు ఫంక్షన్ హాల్స్, జిన్నింగ్ మిల్లులు, సరిహద్దు రాష్ట్రాలు, జిల్లాల పరిధిలోని గోదాముల్లో స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. ఈనెలాఖరు నాటికి 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు అవసరమైన స్థలాలు అందుబాటులోకి రానున్నట్లు అధికారికవర్గాల ద్వారా తెలిసింది.
మరోవైపు ప్రభుత్వం రైస్‌మిల్లర్లతో చర్చల కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి సంప్రదింపులు జరుపుతోంది. ఈ చర్చలుసైతం ఈనెలాఖరు నాటికి కొలిక్కి రానున్నట్లు తెలిసింది. మిల్లర్లు, ప్రభుత్వం మధ్య చర్చలు విఫలమైనా.. ధాన్యం నిల్వలో ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేస్తోంది.
బోనస్ రకాలు 6.15 లక్షల మెట్రిక్ టన్నులు
ఇబ్బందులు లేకుండా చూస్తాం
సీజన్ ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్నిరకాల చర్యలు చేపట్టాం. జిల్లాలోని పలు మండలాల్లో అక్టోబర్ 1 తర్వాత వరి కోతలు మొదలు కానున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండోవారం నుంచే కేంద్రాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ధాన్యం నిల్వలోసైతం ఇబ్బందులు ఏర్పడకుండా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రయివేటు గోదాములు, ఫంక్షన్‌హాళ్లను పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా ధాన్యం రవాణాకు సంబంధించి గత లోటుపాట్లను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నాం.
– బి ప్రవీణ్, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ
జిల్లావ్యాప్తంగా 4.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేస్తున్నారు. అందులో ప్రభు త్వం బోనస్ ప్రకటించిన ఏడు రకాల సన్నాలు 4,18,551 ఎకరాల్లో, ఇతర రకాలు 16,449 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రజల వినియోగం, మి ల్లర్లు, ట్రేడర్ల కొనుగోళ్లను మినహాయిస్తే 6.50 ల క్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రా ల ద్వారా సేకరించాలని లక్ష్యం. 6.15లక్షల మెట్రిక్ టన్నులు బోనస్ రకాలు, మరో 34వేల మెట్రిక్ టన్నులు ఇతర రకాలు ఉన్నాయి.
6.50 లక్షల మెట్రిక్ టన్నుల
కొనుగోలు లక్ష్యం
736 కొనుగోలు కేంద్రాల ద్వారా
సేకరణ
1.63 కోట్ల గన్నీ బ్యాగులు
అవసరమని అంచనా
అక్టోబర్ 15 తర్వాత సెంటర్ల
ప్రారంభానికి సన్నాహాలు!


