డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): అత్యవసర పరిస్థితుల్లో ధైర్యం, సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ కమాండెంట్ బి సీతారాం అన్నారు. యువ ఆపద మిత్ర(వైఏఎంఎస్) కోర్సులో భాగంగా శనివారం ఫైర్ సేఫ్టీపై శిక్షణ ఇచ్చారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు, అగ్నిప్రమాదాల నివారణకు పాటించాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇందల్‌వాయి ఫైర్ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జి, ట్రైనర్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారులు, సిబ్బంది, యువ ఆపదమిత్ర కోర్సు శిక్షణార్థులు తదితరులు పాల్గొన్నారు.


