నిజామాబాద్ రూరల్: తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ.. అదే విద్యార్థులను రచయితలుగా తీర్చిదిద్దుతున్నారు మోపాల్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కాసర్ల నరేశ్ రావు. కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, పరిశోధకులుగా, బాల సాహితీవేత్తగా, సాహి త్య విమర్శకుడిగా, ప్రేరణవక్తగా, రిసోర్స్ పర్సన్‌గా బహుముఖ ప్రజ్ఞ చూపుతున్నారు. 2024లో రాష్ట్ర ఉ త్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న కాసర్ల నరేశ్.. కవనకిరీటి బిరుదు కలిగిన కవిగా ఇప్పటికే పది పుస్తకాలను రచించారు. మరో ఐదు పుస్తకాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు సు మారు 30 రాష్ట్ర, జాతీయ స్థాయి సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. తాను పనిచేసిన సు ద్దులం, గుండారం హైస్కూ ల్ విద్యార్థులతో బాల లేఖి ని, గుండారం గువ్వలు, సిరి లేఖలు, సజనసిరి అనే పుస్తకాలను రాయించారు. ఇటీవల జిల్లా విద్యాశాఖ రూపొందించిన బడిబాట షార్ట్‌ఫిలింలో కాసర్ల విభిన్న పాత్రలు పోషించారు.


