ధర్పల్లి మండలంలోని వాడి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు ప్రసన్న కుమార్. రెండేళ్ల క్రితం స్కూల్‌లో 24 మంది విద్యార్థులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 44 కు చేరింది. విద్యార్థులు డ్రాప్‌అవుట్ లేకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడిమానేసిన వారిని తిరిగి బడిలో చేర్పించడంపై ప్ర త్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులను ఒప్పించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రోజూ ఉదయం 8 గంటల పాఠశాలకు చేరుకునే ప్రసన్నకుమార్.. ఎవరైనా విద్యార్థి పాఠశాలకు రాకుంటే ఇంటికి వెళ్లి బైక్‌పై స్కూల్‌కు తీసుకువస్తారు.


