నందిపేట్(ఆర్మూర్): మండలంలోని వెల్మల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న షేక్ అబ్దుల్ అటు తరగతి గదిలో, ఇటు ఆన్‌లైన్‌లో తన పాఠాలతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. పాఠాలకు ఆటలను మేళవించి బోర్డ్ గే మ్స్, పజిల్స్‌తోపాటు తక్కువ ఖర్చు తో సృజనాత్మకత టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ రూపకల్పన చేసి తరగతులను ఆకర్షణీయంగా మార్చారు. పాఠ్యాంశాల బోధనకు దోహదపడే పరికరాలను సొంత డబ్బులతో కొ నుగోలు చేశాడు. కరోనా సమయంలో విద్యార్థుల కోసం ఆయన ప్రారంభించిన ‘అబ్దుల్ సార్ క్లాస్ రూమ్’ యూట్యూబ్ చానల్ ఎల్లలు దాటింది. 31వేల మంది వరకు సబ్‌స్క్రైబర్లు ఉండగా.. ఆయన అప్‌లోడ్ చేసిన పాఠ్యాంశాల వీడియోలను ఇప్పటి వరకు ఏకంగా 75 లక్షల మంది వీక్షించారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం, సామాన్యశాస్త్రం పాఠ్యాంశాలతోపాటు తోటి ఉపాధ్యాయుల కోసం కూడా బోధన పద్దతులపై వీడియోలు రూపొందిస్తున్నారు. గురుకుల పరీక్షల కోసం చేసిన వీడియోలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. 2025లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు.


