నిజామాబాద్ రూరల్ : ఖేలో ఇండియా యోగా పోటీల సిలబస్‌ను మార్చాలని తెలంగాణ యోగా అసోసియేషన్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని తన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. భారతీయ సంస్కృతికి ప్రతీకై న యోగాలో దేశంలో 1974 నుంచి యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీలు నిర్వహిస్తోందని తెలిపారు. యోగాకు సంబంధం లేని కొంతమంది దొడ్డి దారిన యోగాసనా భారత్ సరైనదంటూ ఆయుష్ డిపార్ట్‌మెంట్ ద్వారా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్లియేషన్ పొందినట్లు చెప్పారు. ప్రాచీన యోగాను పక్కనపెట్టి తమకు అనుకూలమైన సిలబస్ యోగాసనా భారత్ చేసిన సిఫారసు మేరకు ఇన్నాళ్లు పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న సిలబస్ తో కూడిన యోగా పోటీలను ఖేలో ఇండియాలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సిలబస్ తో పాటు అప్లియేషన్ విషయాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖతో మాట్లాడతానని కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చినట్లు సిద్ధారెడ్డి పేర్కొన్నారు.


