● ఎంపిక కోసం ఈనెల 23న
ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష
నిజామాబాద్ అర్బన్: పోలీసుశాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఈనెల 23వ తేదీన ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆబ్జెక్టివ్ విధానంలో టెస్ట్ ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తుఫారాలను ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసు కోవాలని, నిజామాబాద్ డివిజన్ పరిధిలోని వారికి విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కాలేజీలో, ఆర్మూర్ డివిజన్ వారికి క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజీలో, బోధన్ డివిజన్ వారికి ప్రభుత్వ జూనియర్ ఇంటర్, డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.


