‘సున్‌హరి మిట్టి’ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

‘సున్‌హరి మిట్టి’ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం

Aug 19 2026 1:30 AM | Updated on Aug 19 2026 1:30 AM

సుభాష్‌నగర్‌: హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లాకు మంగళవారం జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, సెక్రెటరీ భవానీ, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురితో కలిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. నగరంలోని జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 25న నిర్వహిస్తున్న పసుపు మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమం, సున్‌హరి మిట్టి అభియాన్‌ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ము ఖ్యఅతిథిగా విచ్చేయాలని వారు కోరారు. కాగా అదేరోజు గవర్నర్‌ జిల్లా పర్యటన ఖ రారైనట్లు తెలిసింది. నగరంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నషా ముక్త్‌ భారత్‌ ప్రచా ర కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. అదేవిధంగా నగరశివారులోని పీహెచ్‌ఆర్‌ కల్యాణమండపంలో ఎంపీ అర్వింద్‌ జన్మదినం సందర్భంగా నిర్వహించే చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement