పెద్దపులి బతికే ఉందా? | - | Sakshi
Sakshi News home page

పెద్దపులి బతికే ఉందా?

Aug 19 2026 1:30 AM | Updated on Aug 19 2026 1:30 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): కమ్మర్‌పల్లి అడవుల్లో కనిపించకుండా పోయిన పెద్దపులి ఇంతకు బతికే ఉందా? నాలుగు నెలలుగా అటవీ శాఖ అధికారులు ఈ ప్ర శ్నకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. పులి బతికే ఉందని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడం, ఉన్నట్టుండి అధికారులు మౌ నం పాటిస్తుండడం వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందనే అనుమానాలు పెరుగుతున్నాయి. పెద్దపులి సె ర్చ్‌ ఆపరేషన్‌లో చిరుతలను హతమార్చిన ఉదంతం వెలుగుచూడగా, పులి విషయాన్ని తేల్చకుండా అధికారులు వెనక్కి తగ్గడం అంతుచిక్కని రహస్యంగా మారింది. బలమైన క్లూ దొరికినప్పటికీ ఎవరో చేస్తున్న ఒత్తిళ్లతో ముందుకు వెళ్లలేకపోతున్నారని తెలుస్తోంది.

మార్చిలో వచ్చి... ఏప్రిల్‌లో మాయం!

జే–1గా పిలువబడే పెద్దపులి మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఆదిలాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల మీదుగా నిజామాబాద్‌ జిల్లాలో సంచరించింది. ఈ ఏడాది మార్చిలో కమ్మర్‌పల్లి అడవుల్లోకి వచ్చింది. పులి కదలికలు ట్రాప్‌ కెమెరాలో రికార్డయ్యాయి. గట్టుపొడిచిన వాగువద్ద దట్టమైన అడవికి తోడు నీటి వనరులు ఉండడంతో ఆ ప్రాంతంలోనే తిరిగింది. భీమ్‌గల్‌ ప్రాంతంలో రెండు అవులపై దాడిచేసి హతమార్చింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్‌లో దమ్మాయిపేట్‌ అటవీ ప్రాంతో కూడా ఒక ఆవును చంపింది. ఏప్రిల్‌లో మరోసారి జిల్లాలోకి వచ్చిన పెద్దపులి కమ్మర్‌పల్లి అడవుల్లోనే తిరిగి జాడలేకుండా పోయింది. పులి జాడను కనిపెట్టేందుకు నాలుగు జిల్లాల సరిహద్దుల్లో అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రప్పించారు. డ్రోన్లు తెప్పించారు. ట్రాప్‌ కెమెరాలు పెట్టినా పులి ఆనవాళ్లు చిక్కలేదు. నేలపై ఎక్కడా దాని పాదముద్రలు కనిపించలేదు. అయితే స్థానిక అటవీ అధికారులు వేటగాళ్లపై నిఘా సారించి పులి సంరక్షణకు చర్యలు చేపట్టకపోవడంతేనే ఈ పరిస్థి తి వచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పులి వేటగాళ్ల చేతికి చిక్కిందా అనే అనుమానంతో మే నెలలో కోనాపూర్‌ సెక్షన్‌ సమీప గ్రామాల్లోని పలు వురి ఇళ్లలో పోలీసుల సహాయంతో తనిఖీలు నిర్వహించారు. కథ ఇంతవరకు బాగానే నడించింది. పెద్దపులి సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుండగా.. వేట గాళ్లు చిరుతలను హతమార్చిన ఘటనలు వెలుగుచూశాయి. విచారణ చేపట్టిన సీసీఎస్‌ పోలీసులకు కారేపల్లి అడవుల్లో పాతిపెట్టిన చిరుత కళేబరం, అలాగే ఇందల్వాయి రేంజ్‌ ధర్పల్లి శివారులోని ఓ వ్యవసాయ బావిలో చిరుత చర్మంతోపాటు నిందితుల వద్ద దాని గోళ్లు లభించాయి. వేటగాళ్లను జై లుకు తరలించారు. అయితే పెద్దపులి కనిపించకుండా పోవడం వెనుక శాఖలోని ఓ ఉద్యోగి పాత్ర ఉందనే అనుమానంతో ఇటీవల ఉన్నతాధికారులు వి చారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విచారణ కొనసాగుతున్న తరుణంలోనే అధికారులు సైలెంట్‌ అయిపోయారనే చర్చ సర్వత్రాసాగుతోంది.

జే–1 జాడ లేకపోవడంపై పెరుగుతున్న అనుమానాలు!

డ్రోన్లు తిరిగినా, ఆపరేషన్లు చేసినా

లభించని ఆధారాలు

సవాల్‌గా తీసుకున్న అధికారులు

ఉన్నట్టుండి ఎందుకు ఆగిపోయారు?

ఒత్తిళ్లతో అసలు కథను

తొక్కి పెడుతున్నారా?

అటవీ అధికారుల మౌనం వెనుక

ఎన్నో సందేహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement