నిజామాబాద్‌అర్బన్ : నేరస్తులను శిక్షించడమే కా కుండా వారిలో పరివర్తన తెచ్చి, సమాజంలో బా ధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి జైళ్ల శాఖ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తోంది. తా ము చేసిన తప్పును తెలుసుకున్న ఖైదీలకు అక్షరజ్ఞానాన్ని ప్రసాదించింది. నేరం వెనుక ఉన్న గతాన్ని పక్కనపెట్టి, విద్యాబుద్ధులతో భవిష్యత్తు వైపు అ డుగులు వేసేందుకు కల్పించిన అవకాశాన్ని సద్విని యోగం చేసుకొని నిజామాబాద్ కేంద్ర కారాగారానికి చెందిన ఖైదీలు ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో 15 మంది ఖైదీలు అద్భుత విజయం సాధించారు.
ప్రత్యేకంగా టీచర్ల నియామకం
జిల్లా జైలులో ఓపెన్ ఎస్సెస్సీ చదువుతున్న ఖైదీల కోసం ప్రత్యేకంగా టీచర్లను నియమించి పాఠాల బోధన చేపట్టారు. గతేడాది మేలో ఎన్‌ఐవోఎస్ ద్వా రా తరగతులు ప్రారంభమయ్యాయి. టీచర్లు నాగరాజు, గంగాధర్, సరిత, శివకుమార్ జైలులోనే ప్ర త్యేక బోధన చేశారు. తెలుగు, ఇంగ్లిష్, డేటా ఎంట్రీ, పెయింటింగ్, హోమ్ సైన్స్ సబ్జెక్టుల్లో శిక్షణ ఇ చ్చారు. డేటా ఎంట్రీ, పెయింటింగ్ వంటి వృత్తి వి ద్యా కోర్సులతో ఖైదీలు విడుదలయ్యాక సమాజంలో సొంతంగా ఉపాధి పొంది గౌరవంగా జీవించే అవకాశం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించేందుకు ఆ శాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా దూరవిద్యా విధానం(ఎన్‌ఐవోఎస్) ప్రవేశపెట్టింది. దీంతో నిజామాబాద్ జై లు నుంచి మొత్తం 16 మంది ఖైదీలు ఓపెన్ ఎ స్సెస్సీ చదివారు. అందులో 15 మంది ఉత్తీర్ణులు కాగా, ముగ్గురు ఖైదీలు కరీంనగర్ నుంచి కేవలం పదో తరగతి విద్యను అభ్యసించేందుకు జిల్లా జైలుకు రావడం గమనార్హం. అయితే, సాధారణంగా ఖైదీలు విద్యను అభ్యసించినప్పటికీ పరీక్షలు రాసే సమయంలో ఎదురయ్యే భద్రతా కారణాలు, రవాణా ఇబ్బందులు వారి చదువుకు ఆటంకంగా మారేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, పరీక్షలు రాసేందుకు బయటికి వెళ్లే అవసరం లేకుండా జైలు ఆవరణలోనే ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.


