న్యూస్‌రీల్
ప్రజావాణికి
80 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 80 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ భు జంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్‌వో గీత, నగర పాలకసంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో సాయన్న, ట్రె యినీ ఆర్డీవో సందీప్, రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌కు విన్నవిస్తూ అర్జీలు అందజేశా రు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను స త్వరమే పరిష్కరించాలని అధికారులకు కలె క్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ ప్రజావాణికి
31 అర్జీలు
నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 31 ఫిర్యాదులు అందాయి. ఫి ర్యాదులను స్వీకరించిన సీపీ సాయిచైతన్య సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు వచ్చి సీపీకి తమ సమస్యలను విన్నవించారు.
భారీ వర్షం
నిజాంసాగర్: నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాలలోని పలు ప్రాంతాలలో సోమవారం విడతలుగా భారీ వర్షం కురిసింది. దీంతో మహమ్మద్‌నగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్‌కు వరద వస్తుండడంతో రిటెయినింగ్ వాల్‌కు అడ్డుకట్టగా వేసిన మొరం బస్తాలు కొట్టుకుపోయింది. దీంతో నీరు వృథా కాకుండా ఉండేందుకు వరద గేటు ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు మళ్లించారు.
వేల్పూర్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం వేల్పూర్ తహసీల్ ఎదుట సోమవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. తమ ప్రభుత్వ హయాంలో పేదలు, రైతులు, వృద్ధుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేసే కుట్ర పన్నుతోందని విమర్శించారు. పేదింటి ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ వారు తమకు అనుకూలమైన వారితో కేసు వేయించి పథకాన్ని రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయకుండా ఈ పథకాలను కొనసాగిస్తామని కోర్టులో స్పష్టమైన అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. వచ్చే విచారణలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించి పథకాలను కొనసాగిస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ అనురుధ్‌కు వినతిపత్రం అందజేశారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సాలూర మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గదుల కొరతను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీడీవో నర్సయ్య, తహసీల్దార్ నవాజ్‌ను కలసి విజ్ఙప్తి చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థలం లేకపోవడంతో రైతు వేదిక భవనంలో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలస్థాయిలో ప్రజావాణి ప్రారంభమైన మొదటిరోజున వివిధ సమస్యలపై పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు తమ విజ్ఞప్తులను సమర్పించారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సమస్యలను స్థానికంగానే ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్ధేశంతో మండల స్థాయిలో ‘ప్రజావాణి’ని సోమవారం ప్రా రంభించారు. తొలి సమావేశానికి పలు మండలా ల్లో విశేష స్పందన లభించగా, మరికొన్ని మండలా ల్లో ఆదరణ కరువైంది. జిల్లావ్యాప్తంగా మండలకేంద్రాల్లో ఎంపీడీవో, తహసీల్దార్‌ల ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వర కు ‘ప్రజావాణి’ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఙప్తులను స్వీకరించారు. తనకు జీ రామ్ జీ (ఉపాధిహామీ) జాబ్‌కార్డు కావాలని రాయకూర్ క్యాంప్‌నకు చెందిన విజయ్‌కుమార్ రుద్రూర్‌లో నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తును అందజేశాడు. అధికారులు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో దరఖాస్తుదారుడు సంతోషం వ్యక్తం చేశాడు.
నామమాత్రపు హాజరుపై విమర్శలు
ప్రతి సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కా ర్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి ఎక్కువగా మండలస్థాయి సమస్యలే వస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటిలో ఎక్కువ శాతం సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలుగా మండలకేంద్రాల్లోనే ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే చాలాచోట్ల ఎంపీడీవో, తహసీల్దార్‌తోపాటు ఇద్దరు, ముగ్గురు అధికారులతోనే ప్ర జావాణి కార్యక్రమం ముగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ, ఉ ద్యాన, విద్య, వైద్య, పశుసంవర్ధక, పంచాయతీరా జ్, విద్యుత్, మత్స్య, గృహనిర్మాణ, అంగన్‌వాడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమ శాఖ లు, అటవీ, స్థానిక ఎస్సై తదితర అధికారులు తప్పనిసరిగా హాజరవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా చాలా చోట్ల మెజార్టీ అధికారులు హాజరుకాలేదు.
కోటగిరి మండలంలో 11 దరఖాస్తులు రాగా, రుద్రూర్, పోతంగల్ మండలాల్లో నాలుగు చొప్పు న, మాక్లూర్ మండలకేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో కేవలం ఒక దరఖాస్తు మాత్రమే వ చ్చింది. మండలాల్లో వస్తున్న దరఖాస్తుల్లో అధికంగా పింఛన్‌లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలకు సంబంధించిన విజ్ఙప్తులే ఎక్కువగా ఉన్నాయి.
‘చలో విద్యుత్ సౌధ’ పోస్టర్ల ఆవిష్కరణ
స్కూళ్లలో పనులు పూర్తి చేయాలి
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు వీలుగా చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌రెడ్డి సూచించారు. కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి వివిధ శాఖల పనితీరుపై సంబంధిత అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి.. విద్యార్థుల సంఖ్య, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో పనులను పూర్తి చేయాలన్నారు. ఎక్కడా కూడా తాగునీరు, టాయిలెట్స్ వంటి సమస్యలు లేకుండా చూడాలని, విద్యార్థులు ప్రయోజనాల విషయంలో రాజీ పడొ ద్దని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులకు వారం రోజుల్లోగా యూనిఫామ్‌ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫామ్‌లను వేగవంతంగా కుట్టించాలని సూచించారు.
పౌర సరఫరాల శాఖ పనితీరును సమీక్షిస్తూ.. డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై చేపట్టిన చర్యల వివరాలను సుదర్శన్‌రెడ్డి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత మంది నుంచి ఎంత మొత్తం బకాయిలు రాబట్టగలిగారు, ఇంకా ఎంత మంది సీఎంఆర్‌కు సంబంధించిన బకాయిలు చెల్లించేందుకు సముఖంగా ఉన్నారనే వివరాలపై ఆరా తీశారు. బకాయిలు చెల్లించని మిల్లర్లకు నోటీసులు జారీ చేసి, రెవెన్యూ రికవరీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. నిజామాబాద్ నగరంలో చెత్త సేకరణ కోసం డంపింగ్ యార్డ్ మల్టిపుల్ పాయింట్స్‌ను ఏర్పాటు చేయాలని కమిషనర్ దిలీప్‌కుమార్ కు సూచించారు. జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్‌డీవో సాయన్న, డీఎస్‌ఓ శ్రీకాంత్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం ప్రవీణ్, డీఈవో అశోక్, డీపీవో శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: పెన్షనర్లకు సంబంధించి పీఆర్‌సీ 26వ వేతన కమిటీ ఏర్పాటు చేయాలని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ప్రయివేటీకరణ నిలిపేయాలని తదితర డిమాండ్‌లతో ఈనెల 19న చేపట్టనున్న చలో విద్యుత్ సౌధా మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ రఘునందన్ పిలుపునిచ్చారు. చలో విద్యుత్ సౌధ మహాధర్నా పోస్టర్లను నాయకులతో కలిసి సోమవారం నగరంలోని జేఏసీ కార్యాలయంలో ఆవిష్కరించారు. డిమాండ్‌లు సాధించుకునే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని రఘునందన్ స్పష్టంచేశారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి పూదరి గంగాధర్, జేఏసీ కన్వీనర్ ప్రసాద్‌రెడ్డి, జి శ్రీనివాస్, తోట రాజశేఖర్, రాజేంద్రరెడ్డి, గంగారాం నాయక్, పీరాజీ, చంద్రశేఖర్, నరేష్, రాజేందర్ గౌడ్, జిల్లాలోని అన్ని డివిజన్‌ల చైర్మన్‌లు, జనరల్ సెక్రెటరీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ నిరసన
కాంగ్రెస్ అఽగ్రనేత సోనియాగాంధీ వందేమాతర గీతాన్ని పాడకుండా అడ్డుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు.. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాయి.
కదం తొక్కిన ఏబీవీపీ
సాంకేతిక విద్యావ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు, పాలిటెక్నిక్ జిల్లా కేంద్రంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలన్నారు.
బీఆర్‌ఎస్ ఆందోళన
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీఆర్‌ఎస్ శ్రేణులు సోమవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. రోడ్లపై బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
మంచి అవకాశం..
జిల్లాస్థాయిలో కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణికి సైతం ఎక్కువగా మండలస్థాయిల సమస్యలు వస్తున్నా యి. మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం ద్వారా స్థానిక సమస్యలకు పరిష్కారం సులభమవుతుంది. సమస్యలను గుర్తించి ఎప్పటిప్పుడు సంబంధిత అఽధికారులతో మాట్లాడుతున్నాం. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– నర్సయ్య, ఎంపీడీవో, సాలూర మండలం
మండలకేంద్రాల్లో మొదలైన కార్యక్రమం
సింహభాగం వినతులు పింఛన్‌లు,
ఇందిరమ్మ ఇళ్లపైనే..
భూ సమస్యలపై కొనసాగుతున్న
దరఖాస్తులు
మండలస్థాయిలో పలుశాఖల
అధికారుల ప్రాతినిధ్యం కరువు
నాణ్యతా ప్రమాణాలు పాటించని
కాంట్రాక్టర్ లను బ్లాక్ లిస్టులో పెడతాం
వారం రోజుల్లోపు ఏకరూప
దుస్తులు పంపిణీ చేయాలి
సమీక్ష సమావేశంలో
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి


