చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

Aug 17 2026 12:41 AM | Updated on Aug 17 2026 12:41 AM

గోవు అక్రమ రవాణా అడ్డగింత

కాపాడిన 108 సిబ్బంది

భిక్కనూరు: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా 108 సిబ్బంది కాపాడారు. వివరాలు ఇలా.. మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యసమస్యలతో బాధపడుతోంది. దీంతో ఆమె విరక్తి చెంది ఆదివారం స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి ఆమెను చెరువు నుంచి ఒడ్డుకు తీసుకవచ్చారు. వెంటనే ఈఎంటీ రాజేందర్‌, పైలట్‌ రాజయ్య ప్రాథమిక చికిత్స నిర్వహించి ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు. అలాగే పుష్ప వద్ద ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడుతోపాటు నగదును కుటుంబీకులకు అందజేశారు. దీంతో కుటుంబీకులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

పిట్లం(జుక్కల్‌): మండల కేంద్రంలోని పశువుల సంత నిర్వహించే ప్రాంతం నుంచి గోవును వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా ఆదివారం బజరంగ్‌ దళ్‌ సభ్యులు రంజిత్‌, అశోరాజ్‌ అడ్డుకున్నారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసుల సమక్షంలో గోవును గోశాలకు తరలించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement