కమ్మర్‌పల్లి: మండలంలోని చౌట్‌పల్లిలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఓ ఇంట్లో నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు మోర్తాడ్ ఎకై ్సజ్ ఎస్సై మానస ఆదివారం తెలిపారు. కమ్మర్‌పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లోని ఆయా గ్రామాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. చౌట్‌పల్లిలో గడ్డం మహేష్ అనే వ్యక్తి మద్యం విక్రయిస్తుండడంతో దాడి చేసి 3.4 లీటర్ల మద్యం, 7.8 లీటర్ల బీరును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు రజిత, మమత, కమలాకర్, దిగంబర్, శివయ్య, జలపతి, సతీష్ తదితరులు ఉన్నారు.


