నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మెదక్ జిల్లా బూర్గుపల్లి నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను ఆదివారం మాల్తుమ్మెద గేటు వద్ద నాగిరెడ్డిపేట పోలీసులు పట్టుకున్నారు. బూర్గుపల్లికి చెందిన తొగిట బాలరాజు, మెంగరబోయిన యేసు వ్యానులో 29 సంచులలోని సుమారు 14.5క్వింటాళ్ల రేషన్ బియ్యంను పోచారం మీదుగా లింగంపేటవైపు తీసుకెళ్తున్నారు. మాల్తుమ్మెద గేట్ వద్ద నాగిరెడ్డిపేట పోలీసులు తనిఖీలు చేపట్టి, బియ్యంను పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ మదన్, సిబ్బంది ఉన్నారు.


