● స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, పంద్రాగస్టు వేడుకలపై కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిజామాబాద్ అర్బన్ : స్వాతంత్య్ర దినోత్సవా లు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురు వారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్మా ర్ట్ రేషన్‌కార్డుల పంపిణీ జిల్లాస్థాయి కార్యక్రమా న్ని నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ని ర్వహించనున్నారు. ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రేషన్‌డీలర్లు, రేషన్ లబ్ధిదారులు స్మార్ట్ కార్డుల పంపిణీకి హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ అ న్నారు. ఎక్కడా గందరగోళానికి తావుండొద్దని సూచిస్తూ సంబంధిత శాఖల అధికారుల కు బాధ్యతలు పురమాయించారు. అలాగే పోలీ స్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే స్వాతంత్య్ర దినో త్సవాలకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్ర భుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పు రోగతిని సమగ్రంగా తెలిపేలా ముఖ్య అతిథి ప్ర సంగం నివేదిక ఉండాలన్నారు. స్వాతంత్య్ర స మరయోధులతోపాటు వారి కుటుంబీకులను ఘనంగా సత్కరించేలా ఏర్పాట్లు చేయాలన్నా రు. అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్‌వో బి గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ట్రెయినీ ఆర్డీవో సందీప్, డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీవో సాయన్న, సీపీవో కిషన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


