హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

Aug 14 2026 8:02 AM | Updated on Aug 14 2026 8:02 AM

ఇందల్వాయి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాపై గౌరవం, దేశభక్తి, జాతీయ ఐక్యతను ప్రజల్లో పెంపొందించేందుకు ఇందల్వాయి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్‌ ఘర్‌ తిరంగా పేరు మీద బైక్‌ ర్యాలీని మండల కేంద్రంలో గురువారం నిర్వహించారు. ఆగస్టు 15న ప్రజలందరు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగుర వేయాలని వారు పిలుపునిచ్చారు. నల్లవెల్లి సర్పంచ్‌ కన్నె రాజేందర్‌, కిసాన్‌ మోర్చ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు నాయిడి రాజన్న, మోహన్‌ రెడ్డి, జగత్‌ సింగ్‌, మఠంల శేఖర్‌, సక్కి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సిరికొండ: మండల కేంద్రంలో బీజేపీ నాయకులు హర్‌ ఘర్‌ తిరంగా బైక్‌ ర్యాలీని గురువారం నిర్వహించారు. అంగడి బజార్‌ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు జాతీయ జెండాలను పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ.. జాతీయ జెండా కేవలం ఒక పతాకం కాదని, దేశ ఐక్యత, సమగ్రత, త్యాగాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ భక్తిని చాటాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు బాబురావు, మహేందర్‌, గోవింద్‌, లింబాగౌడ్‌, గోపి, లింబాద్రి, ప్రభాకర్‌, గంగాధర్‌, నారాయణ, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement