ఝార్ఖండ్‌ సీఎం దిష్టిబొమ్మ దహనం | - | Sakshi
Sakshi News home page

ఝార్ఖండ్‌ సీఎం దిష్టిబొమ్మ దహనం

Aug 14 2026 8:02 AM | Updated on Aug 14 2026 8:02 AM

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీ పీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఎదుట ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ అధ్యక్షుడు సమీర్‌ మాట్లాడుతూ.. ఝార్ఖండ్‌ రాష్ట్రంలో జేపీఎస్సీ, జేఎస్‌ఎస్సీ పేపర్‌ లీకేజీలపై గత 19 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం లాఠీచార్జి చేయడం, భాష్పవాయుగోళాలు, వాటర్‌ కెనాన్స్‌ ప్రయోగించడం సిగ్గు చేటన్నారు. విద్యార్థులు తమ సమస్యలను అసెంబ్లీ దాకా విన్పించేందుకు చేపట్టిన ‘విధానసభ ఘోరా వ్‌’ కార్యక్రమంపై పోలీసులు లాఠీచార్జీ చేయడం హేయమైన చర్య అన్నారు. విద్యార్థులు వారి న్యా యమైన డిమాండ్స్‌ కోసం ఉద్యమిస్తుంటే సీఎం హేమంత్‌ ప్రభుత్వం వారిని అణచివేయడానికి యత్నిస్తుందని ఆరోపించారు.పేపర్‌ లీకేజీకి బా ధ్యులైన అధికారులను, లాఠీచార్జికి కారణమైన పో లీసులను గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఏబీవీపీ నేతలు వనవాసి అశోక్‌,అనిల్‌,లెనిన్‌, మహేశ్‌, కార్తీక్‌, కిరీటి, విఘ్నే ష్‌, చరణ్‌, టిల్లు, ప్రీతం, నిఖిల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement