ఆధ్యాత్మిక మాసం.. శ్రావణం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక మాసం.. శ్రావణం

Aug 14 2026 8:02 AM | Updated on Aug 14 2026 8:02 AM

వివాహ ముహూర్తాల జోరు

ప్రతి రోజు ప్రత్యేకం

ప్రత్యేక వ్రతాలు, పూజలతోపాటు

పండుగల సందడి

కిటకిటలాడనున్న ఆలయాలు

ఆర్మూర్‌: భక్తికి, పూజలకు, పండుగలకు ప్రతీక అయిన శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసం అంతా శివుడు, విష్ణువు, వరలక్ష్మి, నాగదేవత ఆరాధనలతో జిల్లాలోని ఆలయాలు ఆధ్యాత్మికతతో కళకళలాడనున్నాయి. మహిళలు ప్రత్యేక పూజలు, వ్రతాలతో ఈ మాసాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఒక నెల రోజుల పాటు భక్తి, భజనలు, బంధాలతో ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొననుంది. ఈసారి ఆలయాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు.

సోమ, శుక్రవారాలు ప్రత్యేకం..

శ్రావణంలో ప్రతి సోమవారం శివ పూజ, ప్రతి మంగళవారం మంగళగౌరి పూజ, ప్రతి శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఈ ఏడాది శ్రావణ శుక్రవారాలు 4 ఉన్నాయి. సోమవారాల్లో జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ కంఠేశ్వర్‌, చక్రేశ్వరాలయం, శంభుని గుడి, మార్కండేయ మందిరాల్లో రుద్రాభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంగళవారాల్లో నూతన వధూవరులు, ముత్తైదువులు అమ్మవారి ఆలయాల్లో మంగళగౌరి పూజలు నిర్వహిస్తారు. శనివారాల్లో ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బోధన్‌ పట్టణంలోని శివాలయాలతో చక్రేశ్వరాలయంతోపాటు ఆర్మూర్‌ పట్టణంలోని నవనాథ సిద్ధల గుట్ట, వేంకటేశ్వర స్వామి ఆలయం, కుక్కల గుట్ట వేంకటేశ్వరాలయాల్లో వేకువజాము నుంచే మహిళలు పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణంలో ఉపవాసాలు, దానాలు, పురాణ పఠనం చేస్తే విశేష పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. గతేడాది కంటే ఈసారి పూలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, వాయినాల కోసం వస్తువులను వ్యాపారులు అమ్మకానికి సిద్దం చేసుకున్నారు.

శ్రావణ మాసంలోనే ప్రధాన పండుగలు సైతం వస్తున్నాయి. వీటిలో ఈ నెల 17న సోమవారం నాగ పంచమి, 21న శుక్రవారం వరలక్ష్మి వ్రతం, 28న శుక్రవారం రాఖీపౌర్ణమి, సెప్టెంబర్‌ 4న శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగలు ఉన్నాయి.

ఏఐతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

శ్రావణ మాసంలో వివాహాది శుభ కార్యాలకు మంచి రోజులు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఫంక్షన్‌ హాళ్లు, మందిరాలు కళకళలాడనున్నాయి. ఈ మాసంలో 16, 20 నుంచి 28వ తేదీ వరకు, 30వ తేదీ, వచ్చే నెలలో 1, 3, 4, 5వ తేదీల్లో మంచి రోజులు ఉండటంతో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement