క్యాంపస్‌ కబుర్లు | - | Sakshi
Sakshi News home page

క్యాంపస్‌ కబుర్లు

Aug 14 2026 8:02 AM | Updated on Aug 14 2026 8:02 AM

కొనసాగుతున్న బీటెక్‌ పరీక్షలు

తెయూ(డిచ్‌పల్లి): తెయూ ఇంజినీరింగ్‌ కళాశాల బీటెక్‌ సీఎస్‌ఐ, ఏఐ 2వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 1వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. పరీక్షలకు 56 మందికి 55 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు.

పీజీ బ్యాక్‌లాగ్‌ పరీక్షల్లో 84 మంది గైర్హాజరు

తెయూ పరిధిలో కొనసాగుతున్న పీజీ 1, 3వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షల్లో గురువారం 84 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. పరీక్షలకు మొత్తం 449 మందికి 365 మంది హాజరు కాగా 84 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్ధ ఆధ్వర్యంలో నీట్‌ 2027 ఉచిత లాంగ్‌టర్మ్‌ ధీర్ఘకాలిక శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ జోనల్‌ ఆఫీసర్‌ (బాసర జోన్‌2) ఎస్‌.యుగంధర లక్ష్మి గురువారం తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి హైదరాబాద్‌ చిలుకూరు ఫౌండేషన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ)లో బాలురకు, మహేంద్రహిల్స్‌ ఫౌండేషన్‌ (సీవోఈ)లో బాలికలకు చెరో వంద సీట్ల చొప్పున మొత్తం 200 సీట్లకు ఉచితంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2025–26లో ఇంటర్‌లో బైపీసీ పూర్తి చేసి నీట్‌–2026 రాసిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు ఇందుకు అర్హులని తెలిపారు. ఎలాంటి దరఖాస్తు రుసుము లేని ఈ శిక్షణ కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫారం డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 22వ తేదీలోగా సంబంధిత జిల్లా కోఆర్డినేటర్‌కు సమర్పించాలని జోనల్‌ ఆఫీసర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement