● డీఎంహెచ్‌వో రాజశ్రీ
సుభాష్‌నగర్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. గురువారం నగరంలోని కలెక్టరేట్‌లో ఉన్న డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆమె సీజనల్, జీవనశైలి వ్యాధులు, క్షయ, వ్యాధి నిరోధక టీకాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను తొలగించాలని, ఖాళీ ప్లాట్లు, మురుగునీరు నిల్వల్లో ఆయిల్ బాల్స్ వదలాలని సూచించారు. డెంగీ బారిన పడ్డ వారి ఇంటి చుట్టూ 50 ఇళ్ల వరకు స్ప్రే చేయాలని, ఇంటింటికీ జర సర్వే చేపట్టి ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడేగా నిర్వహించాలని, సీజనల్ వ్యాధులపై ప్రజల్లో, పాఠశాలల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. జీవనశైలి వ్యాధుల్లో భాగంగా 30ఏళ్లపైబడిన వారికి హైపర్ టెన్షన్, మధుమేహం, క్యాన్సర్, తదితర నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీటీసీవో దేవి నాగేశ్వరి, పీవోడీటీ అంజన, డిప్యూటీ డీఎంహెచ్‌వో సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు వెంకన్న, వెంకటేశ్, శ్రావ్య, పీహెచ్‌సీల సీహెచ్‌వోలు, హెచ్‌ఈవోలు, హెచ్‌ఈవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.


