యువతే దేశానికి వెన్నెముక | - | Sakshi
Sakshi News home page

యువతే దేశానికి వెన్నెముక

Aug 13 2026 1:39 AM | Updated on Aug 13 2026 1:39 AM

యువతే దేశానికి వెన్నెముక

సుభాష్‌నగర్‌: యువతే దేశానికి వెన్నెముక అని, వారు మత్తుపదార్థాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్‌ విశాల్‌ ఆకుల పేర్కొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో నగరంలోని ఖలీల్‌వాడిలో గల డాక్టర్‌ విశాల్‌ డీ–ఆడిక్షన్‌ సెంటర్‌లో యువతకు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, మత్తు పదార్థాల దుష్ఫ్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు యువత మద్యం, సిగరెట్లు, పొగాకు, గుట్కా, గంజాయి వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడి డిప్రెషన్‌, ఆందోళన వంటి మానసిక సమస్యలకు గురై ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించి, అవసరమైతే వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాలని కోరారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి హరీష్‌ స్వామి, వైద్యులు జీవన్‌రావు, రమణేశ్వర్‌, ఫరీదా బేగం పాల్గొన్నారు.

ఐఎంఏ అధ్యక్షుడు ఆకుల విశాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement