పాఠశాలలో నీటి సౌకర్యం కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలో నీటి సౌకర్యం కల్పించాలి

Aug 13 2026 1:39 AM | Updated on Aug 13 2026 1:39 AM

మోపాల్‌: బోర్గాం(పి) ప్రాథమిక పాఠశాలలో వి ద్యార్థులకు నీటి సౌకర్యాన్ని కల్పించాలని సీపీఐ జి ల్లా కార్యదర్శి పి.సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ ప్రచార యాత్రలో భాగంగా బుధవారం నగరశివారులోని బోర్గాం(పి) ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భో జన పథకాన్ని సీపీఐ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి నాయకులు భోజనాలు చేశారు. అనంతరం సుధాకర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకా న్ని సెంట్రలైజ్‌డ్‌ కిచెన్‌ పేరుతో హరే రామ హరే కృష్ణ అనే స్వచ్ఛంద సంస్థకు కేటాయించడం అన్యాయమన్నారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 54,200 మంది మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు రోడ్డు న పడే అవకాశం ఉందన్నారు. నాయకులు ఓమయ్య, రంజిత్‌, అలీ, రమేష్‌ ఉనారను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement