తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం క్యాంపస్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏబీవీపీ ఇందూర్ విభాగ్ ప్రముఖ్ రేంజర్ల నరేష్ హాజరై, ఉత్సవాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. అనంతరం విద్యార్థినులు బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో పోతురాజుల విన్యాసాలు అలరించాయి. డీజే పాటలకు అనుగుణంగా విద్యార్థులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ శివ, వర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు సమీర్, మోహన్, నాయకులు సాయికుమార్, శివ, మనోజ్, ప్రవీణ్, అశోక్, శివ, రమణ పాల్గొన్నారు.


