డిచ్‌పల్లి/సిరికొండ:ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో డిచ్‌పల్లిలోని తహసీల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ సతీష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అలాగే సిరికొండలో తహసీల్దార్ రవీందర్‌రావుకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


