నిజామాబాద్ రూరల్: ప్రయివేట్, కార్పొరేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకోకుండానే మూడు నెలలుగా పెన్షన్‌లో 1.5 శాతం కోత విధించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఆల్ పెన్షనర్– రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్(నిజామాబాద్) గౌరవాధ్యక్షులు కె. రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. బుధవారం పెన్షనర్స్ భవన్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు శిర్ప హనుమాండ్లు, ప్రధాన కార్యదర్శి ఈవిల్ నారాయణ, నాయకులు ప్రసాదరావు, పురుషోత్తం రావు, చంద్రశేఖర్, రాజేశ్వర్, సాంబశివరావు, లంకా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
18న ‘ సేవాస్ఫూర్తి అవార్డ్స్’
నిజామాబాద్ రూరల్: మానవతా సేవలకు అంకితమై పనిచేస్తున్న సేవకులను గుర్తించి, వారి సేవలకు గౌరవం అందించాలనే మహోన్నత సంకల్పంతో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 18న నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సేవాస్ఫూర్తి అవార్డ్స్–2026 ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. మద్దుకూరి సాయిబాబు తెలిపారు. బుధవారం సంస్థ కార్యాలయంలో సేవా స్ఫూర్తి అవార్డ్స్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు.
‘బొడ్లె సంచి’ పుస్తకావిష్కరణ
ఖలీల్‌వాడి: జక్రాన్ పల్లి మండలం మనోరాబాదు గ్రామానికి చెందిన పాట్కూరు తిరుపతి రెడ్డి రచించిన బొడ్లె సంచి అన్న పుస్తకాన్ని జి ల్లా ప్రధాన గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఉప గ్రంథపాలకులు గ్రేడ్ వన్ ఆఫీసర్ రాజిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ నూర్ సింగ్, రాజిరెడ్డి, కంచరి చిన్న భూమేశ్వర్, లైబ్రరియన్ తారకం తదితరులు పాల్గొన్నారు.
వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి
ఖలీల్‌వాడి: చందూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులపై దాడి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక(టీవీయూవీ) నగర అధ్యక్షులు సుభాష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంలో ఏబీసీడబ్ల్యూవో భాగ్యవతికి బుధవారం వినతిపత్రం అందించారు. నాయకులు నిశ్వాంత్, విజయ్, అనిల్, సచిన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఏఐఎస్‌ఎఫ్ దినోత్సవం
ఖలీల్‌వాడి: ఏఐఎస్‌ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లోని జిల్లా ఏఐఎస్‌ఎఫ్ కార్యాలయంలో బుధవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్ పతాకావిష్కరణ చేశారు. కుశాల్ మాట్లాడుతూ.. 1936 ఆగస్టు 12న విద్యార్థుల హక్కుల కోసం ఏర్పడిన ఏఐఎస్‌ఎఫ్, దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థి ఉద్యమానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నాయకులు ఈశ్వర ప్రసాద్, శ్రీకాంత్, నితిన్, రాజేందర్, చందు, సాయిచరణ్ పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ : యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు 5 రోజుల పని దినాల డిమాండ్‌ను వెంటనే అమలు చే యాలని కోరుతూ బుధవారం నగరంలోని ధ ర్నా చౌక్ వద్ద బ్యాంకు ఉద్యోగులు, అధికారు లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్‌ను ప్రభు త్వం ఇంకా నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో నిరవధిక సమ్మెకు సైతం వెనుకాడబోమని వారు హెచ్చరించారు. తమ సంఘీభావాన్ని ప్రకటించారు. బ్యాంకు అధికారులు రమేశ్, రాజేశ్వర్, గురునాథ్, శ్రీనివాస్, రాజు, సింగారావు, సునీల్, సతీశ్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.


