ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి

Aug 13 2026 1:39 AM | Updated on Aug 13 2026 1:39 AM

సుభాష్‌నగర్‌: ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితా న్ని గడపాలని, ఎలాంటి వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ భు జంగరావు సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖలో ని ఎయిడ్స్‌ విభాగం ఆధ్వర్యంలో రెండు నెలలపా టు నిర్వహించే అవగాహన కార్యక్రమాలను కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ బుధవారం ప్రారంభించారు. ఎయిడ్స్‌పై ఐఈసీ (తీవ్రతరమైన విజ్ఞాన సమాచారం–అవగాహన) కార్యక్రమం, ప్రమాదకర పరిస్థితిని తెలుసుకునే క్యూఆర్‌ కోడ్‌ పోస్టర్‌ను డీఎంహెచ్‌వో రాజశ్రీతో కలిసి ఆవి ష్కరించారు. హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ నివారణలో భాగంగా విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమం రెండు నెలలపాటు కొనసాగుతుందన్నారు. ఎంపిక చేసిన 200 గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని డీ ఎంహెచ్‌వో తెలిపారు. విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు, యువతకు అవగాహన కల్పించేందుకు బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. టీబీ నియంత్రణ అధికారి దేవీ నాగేశ్వరి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సికిందర్‌ నాయక్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌లు వెంకటన్న, సుప్రియ, స్నేహ సొసైటీ కార్యద ర్శి సిద్ధయ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement