క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Aug 13 2026 1:39 AM | Updated on Aug 13 2026 1:39 AM

హాస్టల్‌ వార్డెన్‌కు షోకాజ్‌ నోటీస్‌ విద్యుత్‌ షాక్‌తో లైన్‌మన్‌కు గాయాలు

ఖలీల్‌వాడి: చందూర్‌ హాస్టల్‌ వార్డెన్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ ఉపసంచాలకులు రజిత బుధవారం తెలిపారు. చందూర్‌లోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులను వార్డెన్‌ చితకబాధిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సిగరెట్లు తాగుతున్నారని ఆరోపిస్తూ వార్డెన్‌ కల్పలత ఆదివారం పదిమంది విద్యార్థులను కర్రతో చితకబాధినట్లు విద్యార్థులు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన సంక్షేమ శాఖ అధికారులు నివేదికను ఎస్సీ జిల్లా సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రజితకు అందించారు. దీంతో వార్డెన్‌కు షోకాజ్‌ ఇచ్చారు. విచారణ చేసిన నివేదికను ఇన్‌చార్జి కలెక్టర్‌కు అందించినట్లు తెలిసింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి మరి.

ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామానికి జూనియర్‌ లైన్‌మన్‌ హిమాద్‌కి కరెంట్‌ షాక్‌ తగిలి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలోని ఓ రైతు పొలంలో బుధవారం ఆయన ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి అరచేయి కాలిపోయిందని, ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి కింద పడటంతో తలకు గాయాలైనట్లు తెలిపారు. గాయపడ్డ లైన్‌మన్‌ని చికిత్స నిమిత్తం రైతులు వెంటనే నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందించగా అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. హిమాద్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి ఎల్‌సీ తీసుకున్నా అక్కడ విద్యుత్‌ నిలిపివేసే క్రమంలో ఒక ఫేజ్‌కి సంబందించిన వైరు పూర్తిగా తెరుచుకోకపోవడంతో కరెంట్‌ సరఫరా జరిగినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement