నిజామాబాద్ రూరల్: మాతృమూర్తులు సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలని, సమాజంలో ఎటువంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పే శక్తిగా ఎదగాలని ప్రాంత సహ సంయోజక పద్మశ్రీ, శ్రీవాణి పేర్కొన్నారు. బుధవారం విశ్వహిందూ పరిషత్ ఇందూరు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో మాతృ శక్తి దుర్గావాహిని మహిళా పరిచయవర్గ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృ శక్తి సంయోజక ప్రముఖ వక్త పద్మశ్రీ, దుర్గా వాహిని మహిళామూర్తుల పరిచయ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పద్మశ్రీ , వాణిశ్రీ లు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని వారి స్వశక్తితో తమ జీవితాల్లో స్థిరపడాలని సూచించారు. జిల్లా మాతృశక్తి ఇందూరు జిల్లా సంయోజికగా గాయత్రి, జిల్లా సహ సంయోజికగా జమున, నగర సంయోజికగా అర్చన, సహ సంయోజికగా లాస్య, సత్సంగ్ ప్రముఖ్‌గా సుశీల, బాల సంస్కార కేంద్ర ప్రముఖ్‌గా భాగ్య, సేవా ప్రముఖ్‌గా శ్యామల బాధ్యతలు స్వీకరించిచారు.


