బోధన్ : అర్హులైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ అందించాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని రాకాసీపేట గ్రామాభివృద్ధి కమిటీ హనుమాన్ మందిరం ఫంక్షన్ హాల్‌లో వేదిక జిల్లా స్థాయి సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బోధన్‌లో వచ్చే నెల 1 నుంచి 3 వరకు దివ్యాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలు అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేశ్ బాబు, ప్రెసిడెంట్ గైని రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత, ప్రధాన కార్యదర్శి యేశాల గంగాధర్, ప్రతినిధులు షేక్‌నజీర్, లక్ష్మి, భాను, సాయిలు, సాయమ్మ, బీరుగొండ, దేవదాస్, శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


