రైలులో ఆరు కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రైలులో ఆరు కిలోల గంజాయి స్వాధీనం

Aug 12 2026 3:10 AM | Updated on Aug 12 2026 3:10 AM

రైలులో ఆరు కిలోల గంజాయి స్వాధీనం ఒకరి అదృశ్యం

కామారెడ్డి క్రైం : రైలులో తరలిస్తున్న ఆరు కిలోల గంజాయిని ఎకై ్సజ్‌, రైల్వే పోలీసులు మంగళవారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంభాల్‌పూర్‌ నుంచి మహారాష్ట్ర లోని నాందేడ్‌ వెళ్తున్న నాగవళ్లి ఎక్స్‌ప్రెస్‌ రైలు కామారెడ్డికి రాగానే ఎకై ్సజ్‌, రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఓ ప్యాకెట్‌లో నింపిన ఆరు కిలోల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎవరనేది తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎకై ్సజ్‌ సీఐ సంపత్‌ కృష్ణ తెలిపారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ సుందర్‌ సింగ్‌, ఎస్సైలు విక్రమ్‌ కుమార్‌, శ్రీనివాస్‌రావు, శరత్‌ కుమార్‌, ట్రెయినీ ఎస్సైలు అనిల్‌, మధు, సిబ్బంది పాల్గొన్నారు.

పొతంగల్‌లో గంజాయి పట్టివేత?

రుద్రూర్‌: పొతంగల్‌ మండలంలోని చెక్‌పోస్ట్‌ వద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టుబడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి పట్టుబడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన గంజాయి పరిమాణం, నిందితుని వివరాలు, గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు తదితర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని కోటగల్లికి చెందిన విద్యప్రసాద్‌(54) అదృశ్యమైనట్లు రెండో టౌన్‌ ఎస్సై యాదగిరిగౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. విద్యాప్రసాద్‌కు మానసిక స్థితి బాగాలేదని గతంలో కూడా పలుమార్లు ఇంటినుంచి వెళ్లి తిరిగిరాలేదని కుటుంబీకులు తెలిపారు. భార్య వేదవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement