మత్తు వద్దు.. దేశం ముద్దు | - | Sakshi
Sakshi News home page

మత్తు వద్దు.. దేశం ముద్దు

Aug 12 2026 3:10 AM | Updated on Aug 12 2026 3:10 AM

మత్తు పదార్థాలకు యువత

దూరంగా ఉండాలి

ఆర్మూర్‌ నుంచి లద్దాఖ్‌ వరకు

యువకుడి సైకిల్‌ యాత్ర

ఆర్మూర్‌: దేశభక్తి, ఆ ధ్యాత్మికతను నినాదంగా మలుచుకున్న ఓ యువకుడు సైకి ల్‌పై సాహస యాత్ర కు శ్రీకారం చుట్టా డు. ఆర్మూర్‌ పట్టణానికి చెందిన షేర్‌ ఓంకార్‌ ‘దేశం కోసం.. దైవం కోసం‘ అనే స్ఫూర్తిదాయక నినాదంతో యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దంటూ అవగాహన కల్పిస్తూ ఆ ర్మూర్‌ నుంచి లద్దాఖ్‌ వరకు సైకిల్‌ యాత్ర చేస్తు న్నాడు. ఓంకార్‌ ఉపాధి కోసం గల్ఫ్‌లోని ఖతర్‌ దే శానికి వలస వెళ్తూ వస్తున్నాడు. ఈ ఏడాది సైతం మూడు నెలల సెలవులపై 20 రోజుల క్రితం ఆర్మూర్‌కు వచ్చాడు. యువత గంజాయి, డ్రగ్స్‌, మద్యం లాంటి మత్తు పదార్థాలకు బానిస కావొద్దని అవగాహన కల్పిస్తూ తనదైన శైలిలో సైకిల్‌ యాత్ర నిర్వహించాలని సంకల్పించాడు. ఈ నెల 4న ఆర్మూర్‌ నుంచి ప్రారంభమైన యాత్ర మంగళవారం నాటికి సుమారు 700 కిలో మీటర్లు పూర్తి చేసుకొని మధ్యప్రదేశ్‌లోని కంటి ప్రాంతానికి చేరుకున్నాడు. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై 2,348 కిలో మీటర్ల భారీ లక్ష్యాన్ని ఏ ర్పాటు చేసుకొని ప్రతీ రోజు వంద కిలో మీటర్ల లక్ష్యంతో సైకిల్‌ యా త్రను కొనసాగిస్తున్నాడు. తన సైకిల్‌ యాత్రను ఆ ద్యంతం ఇన్‌స్ర్ట్రాగామ్‌లో వీడియోల రూపంలో పో స్టు చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement