● హోర్డింగ్ ఎక్కి నిరసన
ఎల్లారెడ్డి: భార్య కాపురానికి రావడం లేదంటు ఓ వ్యక్తి హోర్డింగ్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థా నికులు తెలిపిన వివరాల ప్ర కారం.. లింగారెడ్డిపేట గ్రా మానికి చెందిన వడ్ల సత్యనారాయణకు భార్యకు గొడ వలు జరగడంతో కాపురానికి రావడం లేదు. దీంతో అతను సోమవారం రాత్రి పట్టణంలోని బస్టాండ్ ఎదు రుగా ఉన్న హోర్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా స్థానికులు గమనించి పోలీసుల కు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థ లానికి చేరుకొని సత్యనారాయణను స ముదాయించి కిందికి దిగేలా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీ ల్చుకున్నారు.
భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్‌పల్లి శివారు లో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను దుండగులు మంగళవారం ధ్వంసం చేశారు. అందులో ఉన్న కాపర్ కాయిల్స్‌ను దొంగిలించారు. వరుసగా వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసానికి గురవుతుండడంతో పంటలు ఎలా పండించాలంటు రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


