న్యూస్‌రీల్
శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026
– 8లో u
● ఈ ఫొటోలోని మహిళ పేరు చిలుక సునీత. డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన ఈమె ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టగా, నాలుగు విడతలుగా రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 4 లక్షల సాయం అందింది. కానీ, గతేడాది అక్టోబర్‌లో ఇంటి నిర్మాణం పూర్తయితే ఇప్పటి వరకు చివరి బిల్లు అందలేదు. గృహప్రవేశం పూర్తయి పది నెలలు గడిచింది. ఇంకెప్పుడు వస్తుందని అధికారులను ఆరా తీస్తున్నా సమాధానం రావడం లేదు.
● ఈ ఫొటోలోని వృద్ధుడి పేరు మోతె రాములు. మోపాల్ మండల కేంద్రానికి చెందిన ఈయనకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేసింది. నిర్మాణం ప్రారంభించి ఏడాది గడిచినా ఇప్పటి వరకు బిల్లు మంజూరు కాలేదు. అధికారులను అడిగితే ఆన్‌లైన్‌లో పొరపాటున ఎల్–3 కింద నమోదైందని చెబుతున్నారు. మళ్లీ విచారణ చేపట్టి నమోదు చేయించినా నిధులు రావడం లేదు. బిల్లుల కోసం 80 ఏళ్ల వయస్సులోనూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఉన్నతాధికారులు స్పందించి తన సమస్యను తీర్చాలని వేడుకుంటున్నాడు.


