● కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరిన
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
సుభాష్‌నగర్ : నగరంతోపాటు జిల్లాలోని పలు రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని దేవీరోడ్డు, రైల్వేస్టేషన్, నాందేవ్‌వాడ అదనపు వంతెన (ఆర్‌వోబీ), సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆర్‌యూబీ కోసం సుమారు రూ.170 కోట్లు మంజూరు చేయా లని విజ్ఞప్తిచేశారు. రేడియోస్టేషన్ నుంచి ముదక్‌పల్లి పాత పంచాయతీ కార్యాలయం వరకు రూ.30 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్డు కోసం ప్రతిపాదనలు అందజేశామని పేర్కొన్నారు. వర్ని జంక్షన్ నుంచి నిజామాబాద్, ఇందల్వాయి, భీమ్‌గల్ మీదుగా కమ్మర్‌పల్లి వరకు నగరాన్ని కలుపుతూ 107 కిలోమీటర్ల పొడవుతో కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనను కూడా అందజేశామని తెలిపారు. రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి దుబ్బ మీదుగా కాలూర్ రోడ్డు ను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.


