● గతంలో లైసెన్స్ రద్దయిన వ్యాపారికే మళ్లీ అనుమతి!
● అటవీ అధికారుల పాత్రపై అనుమానాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): రెంజల్ మండలం నీలా శివారులో నడుస్తున్న ఓ బొగ్గు బట్టీపై ఈ నెల 5న అట వీ అధికారులు దాడులు నిర్వహించారు. అది లైసె న్స్ కలిగిన బట్టీ అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధమైన కలపను వినియోగించడంతో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు కాగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇవి అటవీ అధికారులు చెప్తున్న మాటలు. కానీ, ఈ బొగ్గు బట్టీ వెనుక చాలా పెద్ద కథే దాగి ఉంది.
11 ఏళ్ల క్రితమే లైసెన్స్ రద్దు.. కానీ మళ్లీ ఎలా?
సదరు వ్యాపారి చాలా ఏళ్ల నుంచే బొగ్గు బట్టీల దందాను కొనసాగిస్తున్నాడు. అటవీ అధికారులను మ చ్చిక చేసుకొచి దందాను నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా నడిపిస్తున్నట్లుగా ఆరోపణలున్నా యి. 11 సంవత్సరాల క్రితమే సాటాపూర్ ప్రాంతంలో ఆయన పేరుపై ఉన్న బొగ్గు బట్టీని అటవీ అధికారులు తనిఖీ చేశారు. బొగ్గు కోసం అక్రమంగా కలపను వినియోగిస్తున్నందుకు లైసెన్సును రద్దు చేశా రు. మధ్యలో మళ్లీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయ గా తిరస్కరణకు గురైంది. దీంతో కుటుంబసభ్యులను ఒకరిని బినామీగా పెట్టి వారి పేరుతో మళ్లీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయగా, అటవీ అధికారు లు రెండేళ్ల క్రితం అనుమతి ఇచ్చారు. ఇందుకోసం వ్యాపారి సదరు అధికారుల చేయి తడిపినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. వచ్చిన లైసెన్స్‌తో రెంజల్ మండలం నీలా శివారులో బొగ్గుబట్టీని ఏర్పా టు చేశాడు. ఒకసారి లైసెన్స్ రద్దు చేసిన వ్యక్తికే మ ళ్లీ అనుమతులు ఇవ్వడం వెనుక అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల కాలంలో అధికారులు ఈ బొగ్గు బట్టీ వైపు కన్నెతి చూడలేదని తెలు స్తోంది. బీట్ ఆఫీసర్ లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో యథేచ్ఛగా వేప, మామిడి, ఇ తర రకాల కలపను బొగ్గు తయారీ కోసం తెచ్చి వినియోగిస్తున్నారు. ఇటు ఎప్పటికప్పుడు కొందరు అధికారులకు మాముళ్లు ముడుతున్నాయనే ఆరోపణలు లేకపోలేవు. బొగ్గు దందా బయటకు పొక్కడంతో ఈ నెల 6న విజిలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధి కారులు వచ్చి విచారణ చేపట్టారు. సంబంధిత అధి కారులను ప్రశ్నించడంతోపాటు జాన్కంపేట్‌లోని వ్యాపారి బొగ్గు గోదామును సైతం తనిఖీ చేశారు. అధికారుల పాత్రపై కూడా ఆరా తీయడంతో పలువురు అటవీ అధికారులకు గుబులు పట్టుకుంది.


