కారు బీభత్సం | - | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం

Aug 8 2026 1:35 AM | Updated on Aug 8 2026 1:35 AM

రెండు బైకులను ఢీకొట్టి..

అతివేగంగా వెళ్లి కల్వర్టును

ఢీకొని మంటల్లో దగ్ధం

నలుగురికి తీవ్ర గాయాలు

నందిపేట్‌(ఆర్మూర్‌): నందిపేట మండలంలో ఓ కారు గురువారం రాత్రి బీభత్సం సృషించింది. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన అనంతరం కల్వర్టును ఢీ కొనడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నంది పేట మండల కేంద్రానికి చెందిన అక్తర్‌ హుస్సేన్‌, ఆయన భార్య అంజుమ్‌ సుల్తానా ఒక బైక్‌పై, ర హీమ్‌, ఆయన భార్య సమీనా మరోబైక్‌పై గురు వారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నందిపేట నుంచి ఆర్మూర్‌కు వెళ్తుండగా విజయనగర్‌ సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో బైక్‌లపై ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గా యాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్తర్‌ హుస్సేన్‌ ముప్కాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు బైక్‌లను ఢీకొట్టి అతివేగంగా వెళ్లిన కారు చింరాజ్‌పల్లి శివారు వి ద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో గుత్ప కాలువ కల్వ ర్టును ఢీకొట్టింది. అనంతరం కారులో మంటలు చెలరేగడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కారులో ప్ర యాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. కారు నడిపిన వ్యక్తిని చౌడమ్మ కొండూర్‌ గ్రామానికి చెందిన దొంతుల గంగాధర్‌గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement