● ప్రజావాణి అర్జీల పరిష్కారానికి
ప్రాధాన్యత ఇవ్వాలి
● తహసీల్దార్లతో సమీక్షలో
ఇన్ చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిజామాబాద్ అర్బన్: భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాల ని ఇన్ చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమీక్ష మందిరంలో శుక్రవారం ఆయన తహసీల్దార్లతో భూ భారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం, ఇతర రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలు, పరిష్కారంలో జాప్యానికి గల కారణాల ను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని కలెక్టర్ గ డువు విధించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. జిల్లాస్థాయిలో ని ర్వహించే ప్రజావాణితోపాటు రాష్ట్రస్థాయిలో నిర్వ హించే సీఎం ప్రజావాణి కార్యక్రమాల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వెంటదివెంట ఆర్జీలను పరిష్కరిస్తూ, వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల ని సూచించారు. పురోగతి వివరాలను నిర్ణీ త నమూనాలో రోజువారీగా తనకు పంపాలని ఆదేశించారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కోసం వచ్చిన దరఖాస్తులను కూడా సత్వరమే పరిష్కరించాలన్నా రు. కస్టం మిల్లింగ్ కోసం లేవీ ధాన్యం కేటాయించిన రైస్‌మిల్లులను పక్షం రోజులకోసారి అయినా సందర్శిస్తూ, ధాన్యం నిల్వలను పరిశీలించాలని తహసీల్దార్లను ఆదేశించారు. నూతన తహసీల్ కా ర్యాలయాల నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను గుర్తిస్తూ, సమగ్ర వివరాలతో నివేదికలు పంపాలని సూచించారు.
హాస్టళ్లు, గురుకులాలను విధిగా సందర్శించాలి
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకులాలను క్రమం తప్పకుండా సందర్శించాల ని మండల ప్రత్యేకాధికారులను ఇన్ చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యా సంస్థల నిర్వహణ గణనీయంగా మెరుగుపడేలా, నాణ్యమైన విద్యాబోధన జరిగేలా క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం మండల ప్రత్యేకాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతివారం – ప్రతి విద్యాసంస్థను తప్పనిసరిగా సందర్శించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాలతోపాటు జిల్లాలోని కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, మహాత్మా జ్యోతీబాపూలే, బీసీ, ఎస్సీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల ను విధిగా సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎ క్కడ కూడా ఫుడ్ పాయిజనింగ్, పాముకాటు, తేలు కాటు వంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యాసంస్థల సందర్శన సమయాల్లో గమనించిన అంశాలను ప్రత్యేక యాప్ ద్వారా తమకు నివేదించాలని కలెక్టర్ సూచించారు. శిథిలావస్థకు చేరిన భవనాలను వెంటనే వాటిని తొలగింపజేయాలని ఆదేశించారు. కాగా, జనగణన హ్యాండ్‌బుక్ రూ పొందించేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో అ న్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, చారిత్రక ప్రదేశాల సమాచారాన్ని క్షేత్రస్థాయి అధికారులు పక్కాగా అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు
సమీక్షా సమావేశానికి ఆలస్యంగా హాజరైన ప లువురు తహసీల్దార్లకు ఇన్‌చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా షోకాజ్ నోటీసులు జారీచేశారు. నిర్ణీత సమయానికి కలెక్టర్ సమావేశ మందిరానికి చేరుకోగా, పలు మండలాల తహసీల్దార్లు గైర్హాజరు కావడాన్ని గమనించి వారి తీరుపై అసంతప్తి వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరూ విధిగా సమయపాలన పాటించాలని కలెక్టర్ సూచించా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఆర్వో గీత, నిజామాబాద్, బోధన్ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయకుమారి, తహసీల్దార్లు పాల్గొన్నారు.


