షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Aug 5 2026 2:35 AM | Updated on Aug 5 2026 2:35 AM

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం రేపు కలెక్టరేట్‌లో జాబ్‌ మేళా

మాచారెడ్డి: మండలంలోని మైసమ్మ చెరువు తండాలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ తో ఓ ఇల్లు పాక్షికంగా దగ్ధమైంది. దీంతో రూ. లక్ష వరకు నష్టం వాటిల్లింది. తండాకు చెందిన మాలోత్‌ తుల్జా నాయక్‌ కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటి నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు తుల్జా కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న విలువైన ఫర్నిచర్‌, ఇతక వస్తువులు దగ్ధమయ్యాయి. రూ. లక్ష వరకు ఆస్తినష్టం జరిగిందని బాధిత కుటుంబీకులు తెలిపారు.

కామారెడ్డి అర్బన్‌: ఎల్‌ఐసీలో బీమా సఖి (మ హిళ ఏజెంట్లు), శ్రీరాం లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో ఫీ ల్డ్‌ సెల్స్‌ అధికారుల నియామకం కోసం గురువారం కలెక్టరేట్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఆసక్తిగలవారు ఉదయం 10.30 గంట ల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించే జాబ్‌ మేళాలో పాల్గొనాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్‌కుమార్‌ తెలిపారు. వివరాలకు 92928 05290లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement