మోపాల్: తెయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్‌ఈ అండ్ ఏఐ) సెమిస్టర్1 థియరీ పరీక్షలు (బ్యాక్‌లాగ్) మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపా రు. మొదటిరోజు 36 మందికి 35 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
పీజీ సెమిస్టర్ పరీక్షలు..
తెయూలోని పీజీ 3 సెమిస్టర్ (బ్యాక్ లాగ్) పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయని ఆడి ట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 565 మందికి 500 మంది హాజరు కాగా 65 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టిస్ కింద నమోదయ్యారని ఆయన తెలిపారు.
మోపాల్: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గల బీఎడ్ 2వ సెమిస్టర్(రెగ్యులర్), బీపీఎడ్ 1, 2, 3, 4 సెమిస్టర్ (బ్యాక్‌లాగ్) పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. చివరిరోజు నిర్వహించిన పరీక్షలకు 562 మందికి 527 మంది హాజరు కాగా, 35మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఖలీల్‌వాడి: ‘దోస్త్‘ స్పెషల్ ఫేజ్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజీలో ప్రథమ సంవత్సరంలో వివిధ కోర్సుల్లో చేరటానికి ఈనెల 6 నుంచి 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. దోస్తు ద్వారా డిగ్రీ కోర్సుల్లో దరఖాస్తు చేసుకొని, విద్యార్థులు రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కమ్మర్‌పల్లి: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు కో–ఆర్డినేటర్ సాయన్న తెలిపారు. 2026 ఏప్రిల్‌లో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు, అలాగే అంతకుముందు నిర్వహించిన పరీక్షల్లోఫెయిల్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా పరీక్షల ఫీజును చెల్లించాలి కోరారు. అలాగే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ ఒపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


