ఎస్‌ఎస్‌ఆర్‌ కాలేజీలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఆర్‌ కాలేజీలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

ఎస్‌ఎస్‌ఆర్‌ కాలేజీలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ పోగొట్టుకున్న ఫోన్ల అందజేత మహాలక్ష్మీనగర్‌లో ఆటో చోరీ దుబ్బలో.. విధులకు ఆటంకం.. ఏడుగురిపై కేసు నమోదు

ఖలీల్‌వాడి: నగరంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ డిగ్రీ, పీజీ కళాశాల (అటానమస్‌)లో మంగళవారం ఐటీ సంస్థ విప్రో ఆధ్వర్యంలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించినట్లు విద్యాసంస్థల చైర్మన్‌ మారయ్యగౌడ్‌ తెలిపారు. సుమారు 400 మంది అర్హులైన అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకొని పాల్గొనగా, సంస్థ ప్రతినిధులు పలు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. అన్ని దశలు పూర్తయిన అనంతరం ఎంపికై న అభ్యర్థుల తుది జాబితాను విప్రో సంస్థ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కలిసి ఇలాంటి క్యాంపస్‌ నియామక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో కళాశాల సిబ్బందికి, విప్రో ప్రతినిధులకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ పీఎస్‌ పరిధిలో పోగొ ట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా సేకరించి బాధితులకు మంగళవారం అందజేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు. బాధితులు ఫోన్‌ పోయిన వెంటనే పోలీస్‌స్టేషన్‌, సీఈఐఆర్‌ పోర్ట్‌లో ఫిర్యాదు చేయా లని సూచించారు.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని 4వ టౌన్‌ పీఎస్‌ పరిధిలో గల మహాలక్ష్మీనగర్‌లో ఆటో చోరీకి గురైనట్లు ఎస్‌హెచ్‌వో సతీశ్‌ తెలిపారు. కాలనీకి చెందిన గుర్రం కల్యాణ్‌ అనే వ్యక్తి రోజు లాగే తన ఇంటి ఎదుట సోమవారం రాత్రి ఆటోను పార్కింగ్‌ చేశాడు. మంగళవా రం ఉదయం చూసే సరికి కనిపించకపోవడంతో పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని దుబ్బ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. మూడో టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బ ప్రాంతానికి చెందిన సాయి పని నిమిత్తం ఇతర ప్రాంతానికి, ఆయన కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో మూడు తులాల బంగారం చోరీకి గురైందని బాధిత కుటుంబీకులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్త్నుట్లు ఎస్సై తెలిపారు.

ధర్పల్లి: అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ధర్పల్లి ఎస్సై సందీప్‌ తెలిపారు. ఎస్సై మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని డీబీ తండా అటవీ ప్రాంతంలో రెండు ట్రాక్టర్లతో అటవీ భూమిని చదును చేస్తున్నప్పుడు అటవీశాఖ అధికారులు అడ్డుకొని ట్రాక్టర్లను పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్‌ చేసేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించగా, తండాకు చెందిన ఏడుగురు వ్యక్తులు అడ్డువచ్చి వారి విధులకు ఆటంకం కలిగించారు. ఈ మేరకు దుబ్బాక బీట్‌ ఆఫీసర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement