తల్లీకుమార్తెల అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

తల్లీకుమార్తెల అదృశ్యం

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

తల్లీకుమార్తెల అదృశ్యం డ్రంకెన్‌ రడ్రైవ్‌లో ఐదుగురికి జరిమానా ముగ్గురిపై కేసు నమోదు

నందిపేట్‌: మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత తన కుమార్తెతో కలిసి అదృశ్యమైనట్లు ఎస్సై వినయ్‌ మంగళవారం తెలిపారు. నెల రోజుల క్రితం తన తల్లి గారింటికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ పీఎస్‌ పరిధిలో పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీ లు నిర్వహించగా ఐదుగురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని మంగళవారం ఆర్మూర్‌ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. విచారణ చేపట్టిన జడ్జి ఐదుగురికి రూ.10వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు.

ఒకరికి ఐదు రోజుల జైలు

నిజామాబాద్‌ రూరల్‌: డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్షను విధించినట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ మంగళవారం తెలిపారు. ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలో వాహనాల తనిఖీ చేస్తుండగా పడకల్‌ గ్రామానికి చెందిన జంపన్న అనే వ్యక్తి మద్యం సేవించినట్లు గుర్తించారు. అతన్ని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చారు. విచారణ చేపట్టిన జడ్జి ఐదు రోజుల జైలు శిక్షను విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని అన్నారు.

నందిపేట్‌ : మండల కేంద్రానికి చెందిన ముగ్గురిపై దొంగతనం, చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నందిపేటకు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డు ఉద్యోగి చల్ల విష్ణువర్ధన్‌ తన భార్య ఏటీఎంను తీసుకుని గత నెల 17వ తేదీన పని నిమిత్తం నిజామాబాద్‌ వెళ్లాడు. మార్గమధ్యలో తనకు స్నేహితులైన నందిపేటకు చెందిన టీ భోజాగౌడ్‌, గంగాధర్‌ కలిసి విష్ణువర్ధన్‌కు మందు తాగించి అతని వద్ద ఉన్న ఏటీఎం దొంగిలించారు. అనంతరం భోజాగౌడ్‌, గంగాధర్‌తో పాటు నందిపేటకు చెందిన లక్ష్మి అనే మహిళతో కలిసి ఏటీఎం నుంచి విడతల వారీగా రూ. 1,05,000 నగదును విత్‌డ్రా చేసుకుని వాడుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై దొంగతనం, చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement