● ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు
సుభాష్‌నగర్: నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీల్లో విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించడంతోపాటు విద్యుత్ సిబ్బంది భద్రతతో పనులు నిర్వహించేందుకు హైడ్రాలిక్ లిఫ్టర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్‌పీడీసీఎల్ నిజామాబాద్ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పీవీ రాజేశ్వర్‌రావు సూచించారు. మంగళవారం నగరంలో విద్యుత్ అంతరాయాల పరిష్కారానికి టాటా యోధా 3.0 ఎంటీ హైడ్రాలిక్ లిఫ్టర్ వాహన సేవలను ఆయన ప్రారంభించారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన, వేగవంత మైన విద్యుత్ సేవలను అందించాలనే లక్ష్యంతో ని జామాబాద్ సర్కిల్ పరిధిలో ఈ వాహనాన్ని అందు బాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. హైడ్రాలిక్ లిఫ్టర్ ద్వారా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల బ్రేక్‌డౌన్‌లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, చెట్ల కొమ్మల తొలగింపు, ఎత్తైన ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, పరికరాల నిర్వహణ పనులు సురక్షితంగా, వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రత్యేకించి ని జామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విద్యు త్ అంతరాయాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించవచ్చని సూచించారు. ఈ వాహనం అందుబాటులోకి రావడంతో అత్యవసర పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించవచ్చని ఆ యన పేర్కొన్నారు. డీఈలు శ్రీనివాస్‌రావు, వెంకటరమణ, ఏడీఈలు చంద్రశేఖర్, ప్రసాద్‌రెడ్డి, వినో ద్, శ్రీధర్, తోట రాజశేఖర్, జేఏసీ ప్రతినిధులు ర ఘునందన్, పూదరి గంగాధర్, గంగారాం, ఏఈ లు, విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


