నిజామాబాద్ అర్బన్ : మైనర్లను ప్రలోభ పెట్టి తమ ఇళ్లలోని బంగారం చోరీ చేయించిన నిందితుడిని మూడో టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు పది తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చగా న్యా యస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు మూ డో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మూడో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ధనుష్ అనే వ్యక్తి కొంత మంది మైనర్లను ప్రలోభాలకు గురిచేసి, వారి ఇళ్లలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించి తనకు తీసుకురావాలని ప్రేరేపించేవాడు. మైనర్లు తమ ఇంట్లోని బంగారాన్ని అతనికి అందజేశారు. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో వారు మూడో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 2న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడు ధనుష్‌ను అదుపులోకి తీసుకొని విచారించి, అతని నుంచి 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.


