బోధన్‌టౌన్: హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బోధన్‌కు చెందిన ఒకినోవా కరాటే స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. పోటీల్లో పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు 2800 మంది పాల్గొనగా కటాస్ విభాగంలో బోధన్‌కు చెందిన ఒకినోవా కరాటే స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు బంగారు, ఏడుగురు సిల్వర్, ఒక్కరు రజత పథకాలు సాధించారని కరాటే మాస్టర్ సాయిలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కరాటే మాస్టర్, సినిమా ఫైటర్ కన్నన్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కి, నేపాల్ కరాటే గ్రాండ్ మాస్టర్ జగదీశ్ సింగ్ ఖాత్రి కరాటే పోటీల్లో వివిధ భాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారని తెలిపారు.


